ఆలయ విస్తరణ పేరుతో ..దళితుల ఇండ్ల కూల్చివేతకు కుట్ర

ఆలయ విస్తరణ పేరుతో ..దళితుల ఇండ్ల కూల్చివేతకు కుట్ర
  • ఇండ్లకు నీళ్లు, కరెంట్ నిలిపేసిండ్రు
  • హెచ్ఆర్సీలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు 

బషీర్‌బాగ్, వెలుగు: వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం మాడవీధుల విస్తరణ పేరుతో 50 దళిత కుటుంబాల ఇళ్లను కూల్చివేయడానికి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బాధిత కుటుంబాలతో కలిసి గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. నెల రోజులుగా నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు వివరించారు.

ఫిర్యాదుపై స్పందించిన కమిషన్, బలవంతపు తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, నీటి సప్లయ్​, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. బాధితులకు రక్షణ కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు సూచిస్తూ, ఈ వ్యవహారంపై మార్చి 9లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.